ఓవర్ నైట్ స్టార్స్ అయిపోదామని సోషల్ మీడియా మీద మోజుతో ఓ తల్లిదండ్రులు చేసిన పని దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది.ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం కోసం ఐఫోన్ కొనాలనుకున్నారు. దీనికోసం కన్న కొడుకునే అమ్మేశారు ఈ కసాయి తల్లిదండ్రులు. అమ్మతనానికే మచ్చతెచ్చిన సంఘటన పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సతి దంపతులకు ఇద్దరు పిల్లలు.
She falsely accused her parents in law and made them arrested. After she sold her son for an iPhone. Wow. Women are all victims. Really. https://t.co/whrvlMJwCp
— Elisabetta Mazza (@MazzaElisabetta) July 27, 2023
ఏడేళ్ల కుమార్తెతో పాటు వారికి 8 నెలల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా పిల్లవాడు కనిపించకపోవడంతో స్థానికంగా నివాసం ఉండే చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో వీరి బాగోతం కాస్త బట్టబయలైంది.అలాగే ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న దంపతుల చేతిలో ఒక్కసారిగా ఐఫోన్ కనిపించడం, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో అనుమానం వచ్చి వారిని నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో తమ కుమారుడిని అమ్మేసి ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు.
ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.తల్లిని అదుపులోకి తీసుకోగా తండ్రి జయదేవ్ పరారీలో ఉన్నాడు. బిడ్డను కొనుగోలు చేసిన మహిళను ప్రియాంగ ఘోష్‌గా గుర్తించి పట్టుకున్నారు. ఇందులో మరో విషయమేమింటంటే తన ఏడేళ్ల కుమార్తెను కూడా అమ్మేయాలని అనుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కడుపున పుట్టిన బిడ్డను అమ్ముకోవడం పట్ల ఈ దంపతులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డబ్బులు కష్టపడి ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ కడుపు పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను అమ్ముకోవడం ఏంటని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీరిని చూసి సమాజం చాలా చెడిపోతుందని వీరిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని అభం శుభం తెలియని పిల్లలను అమ్ముకోవడం ఏంటంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది ఘాటుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా చిన్నచిన్న విషయాలకు కష్టం చేసి సంపాదించుకోవాలే తప్పా కన్నపిల్లలను అమ్ముకోకూడదంటూ సలహాలు ఇస్తున్నారు. మీకు పనికావాలంటే చెప్పడంటూ దేశమంతటా నెటిజన్లందరూ తమదైనా శైలీలో చురకలు అంటిస్తున్నారు. మీకు పనిచేయడం చాతకాకపోతే పిల్లలని కనడం ఎందుకంటూ నిలదీశారు. పని చేయడం చాతకాకపోతే అడుక్కోనైనా సరే పిల్లలను పోశించాలంటూ కామెంట్స్ రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.