కేంద్ర మంత్రి ఇంట్లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన వారిలో ఇద్దరు లొంగిపోయారు.
ఓ విదేశీ మహిళపై గైడ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తిరువణ్ణామలైలో జరిగింది. ఫ్రాన్స్ దేశస్థురాలు ధ్యానం కోసం గైడ్ సాయంతో కొండపైకి వెళ్లింది. ఈ క్రమంలో గైడ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని NTTPS కోల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్‌ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు వద్ద మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమగా పెంచుకున్నందకు ఓ కుక్క యాజమాని ప్రాణం తీసిన ఘటన కాన్పూర్‌లో జరిగింది. ఇంటి ఆవరణంలో ఉన్న యజమానిపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ముఖం, కడుపుపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శివ క్షేత్రమైన మహానందిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల నుంచి ఉన్న నాగనంది సదనం కూల్చివేత ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గదులు శిథిలం అయిపోవడంతో భక్తుల కోసం కొత్త వసతి గృహాలు నిర్మించారు. పాతవి కూల్చే సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మార్టూరు జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న 7గురిలో వైజాగ్‌కు చెందిన భీమన నవీన్(32) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు లోపల రహదారుల నిర్మాణం చేపడుతుండగా బండరాళ్లు అడ్డు వచ్చాయి. వాటిని తొలగించేందుకు బ్లాస్టింగ్ చేశారు. ఈ ఘటనలో బోర కొత్తయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
హబ్సిగూడలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది.