Telangana:నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
సూర్యపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17మంది కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు.
రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ.
తెలుగు ఆడపడుచు, ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు. హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో నామినేషన్ దాకలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం తీసుకురాలేమని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను వాడుకుంటున్నాయని అన్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే.. కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
సీఎం రేవంత్‌రెడ్డిని GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్ దంపతులు చేరబోతన్నట్లు సమాచారం. మొన్ననే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు.