KCR : కేసీఆర్‌పై గౌరవం తగ్గలేదు!
బీఆర్ఎస్ నుంచి చాలమంది నేతలు వెళ్లిపోయిన కూడా ఆ పార్టీకి ఎలాంటి నష్టం లేదని.. పార్టీ కేడర్ మాత్రం కేసీఆర్‌తోనే ఉందని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కొంతమేరకు ప్రభావం చూపించినా ఆయనకు ఇది విజయమేనని పేర్కొన్నారు.
KCR: కొత్త ఎక్స్ ఖాతా తెరచిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై ఫైర్
మాజీ సీఎం కేసీఆర్ కొత్తగా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను తెరిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కరెంటు కోతలు ఉన్నాయని.. ఇది కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం అంటూ విమర్శించారు.
Alleti Maheshwar Reddy: రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఎన్నికల సమయంలో రేవంత్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపిస్తా అని అన్నారు.
Tammineni Veerabhadram: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు
TG: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Etela Rajender : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్
TG: సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేయాలని అన్నారు. మీరు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
Rahul Gandhi: ఓటమి భయం కనిపిస్తోంది.. మోడీ కన్నీళ్లు పెట్టుకుంటారు!
బీజాపూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. మోడీ ఒత్తిడిలో కనిపిస్తున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచార వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎదురుకాబోతున్న ఓటమి భయం మోడీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
Kishan Reddy : మతి భ్రమించి, మదమెక్కి మాట్లాడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్!
బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు. కొంతమంది నాయకులకు మతిభ్రమించి, కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని మాట్లాడుతున్నారన్నారు. సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పారు.
Harish Rao : బిడ్డా గన్ పార్క్ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం!
రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు.