Nara Lokesh:ఏసీబీ కోర్టులో లోకేష్ పై సీఐడీ మోమో!
లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.
చంద్రబాబుకు కొత్త చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అనారోగ్య కారణంగా జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆయన.. జైలు బయట ప్రసంగించండం సీఐడీకి ఆయుధంగా మారింది. కోర్టు నిబంధనల ప్రకారం.. ఆయన మీడియాతో మాట్లాడటం, ప్రసంగించడం చేయొద్దు. కానీ, ఆయన జైలు బయట ప్రసంగించారు. దీనిని సీఐడీ సీరియస్గా తీసుకుంది. దీని ఆధారంగా బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను రెండో రోజు సీఐడి విచారించనుంది. నేడు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేశ్ ను ఆదేశించింది. కాగా మంగళవారం దాదాపు 6గంటల పాటు లోకేశ్ ను సీఐడీ ప్రశ్నించింది. ఆయన్ను 30 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. విచారణకు లోకేశ్ ఏమాత్రం సహరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి సీఐడి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే నేడు సీఐడీ ముందు విచారణకు లోకేశ్ హాజరుకానున్నారు.
టీడీపీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ సీఐడీ ముందు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీఐడీ అధికారులు అయన్ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే నారా లోకేశ్ ను సీఐడీ ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. ప్రధానంగా పది ప్రశ్నలకు లోకేశ్ ను సీఐడీ అడిగినట్లు తెలుస్తోంది. అవేంటంటే..
నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటీషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా పేర్కొన్నారు.