Andhra Pradesh: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ బదిలీ.

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు అధికారులపై కొత్త రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌, విజిలెన్స్‌ ఐజీ, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

New Update
Transfers: ఏపీలో ఇద్దరు కీలక అధికారుల బదిలీ.

AP CID Transferred: ఆంధ్రాలో పలువురు అధికారులపై బదిలీ వేటు పడింది. ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌, విజిలెన్స్‌ ఐజీ, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కొల్లి రఘురామిరెడ్డిలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిద్దరూ వెంటనే డీజీపీ కార్యాలయంలె రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాత ప్రభుత్వం ఉన్న సమయంలో వీరు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇప్పుడు వారిని బదిలీ చేయాలని భావిస్తోంది. ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌ రెడ్డి, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిలను సైతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిద్దరూ కూడా వెంటనే పరిపాలనశాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం బాధ్యతలను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు అప్పగిస్తూ ఆదేశించారు.

Also Read: రామోజీరావు ఇక లేరు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు