Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.
చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా నిన్న పెట్టిన ట్వీట్ కు అర్ధమేమిటో ఈరోజు తెలిసింది. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో తేలకపోతే ఏమయింది సుప్రీంకోర్టు ఉందిగా అంటున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ బాబు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు కస్టడీలో భాగంగా తొలి రోజు ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్వశ్చనైర్ ప్రకారం.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమని డీజీ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వెల్కర్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి 2022లో డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల పూర్తి వివరాలతో కూడిన లేఖను బయటపెట్టారు.
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది.