TS Elections 2023: ఈ 8 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ వారే.. కానీ పార్టీలే మారే!
నకిరేకల్, పినపాక, కొల్లాపూర్, ఇల్లందు, పాలేరు, సత్తుపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆయా స్థానాల్లో గతేడాది పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులే ఈ సారి మళ్లీ తలపడుతుండగా.. వారి పార్టీలే మారిపోయాయి.