KCR: ఎన్నికల హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు.
మాజీ సీఎం కేసీఆర్.. చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేరవేర్చలేదని ధ్వజమెత్తారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు చుక్కెదురైంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలు రూ.కోట్లు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.
పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆరోపించారు.
తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అన్యాయాలపై విచారణ చేపట్టి వారిని జైలు పంపడం ఖాయమని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. దివంగత నేత సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదిత పేరును ప్రకటించారు. లాస్య నందిత మృతితో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.
కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండు, చేనేత కార్మికుడు చితికిపోతుండని అన్నారు కేటీఆర్. ఢిల్లీలోని బడే-భాయ్ జీఎస్టీ దెబ్బకు చేనేత రంగం కుదేలైంది.. గల్లీలోని ఛోటే-భాయ్ నిర్లక్ష్యానికి నిలువునా బలైందని విమర్శించారు.