BREAKING: ఆర్కేకు షాక్ ఇచ్చిన సీఎం జగన్.. వైసీపీ సస్పెన్షన్
మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆర్కేను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆర్కేను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చవుతోందని అంచనా.
టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ సమగ్ర ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు రద్దు చేసింది.
ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్ నియామకాలు రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వరుణుడు ఆటంకంగా కలిగించనున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మల్ కోల్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి.