TS Elections: తెలంగాణ ఎన్నికలకు వరుణ గండం! తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వరుణుడు ఆటంకంగా కలిగించనున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. By V.J Reddy 29 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rains In Telangana: తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు రేపు సెలవు దినంగా ప్రకటించాలని తెలిపింది. ALSO READ: BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! ఇదిలా ఉండగా ఎలక్షన్ పోలింగ్ డే కు వరుణ గండం పట్టుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ అకాల వర్షాల కారణంగా ఎన్నికల పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ వర్షాల వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా? లేదా? అనేది చూడాలి. ALSO READ: BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం! #rains-in-telangana #breaking-news #telangana-elections-2023 #telugu-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి