BREAKING: వైసీపీ మంత్రికి గుండె నొప్పి!
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేణుగోపాలకృష్ణ చేరారు. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. గుండెనొప్పితో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేణుగోపాలకృష్ణ చేరారు. మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పీఎం మోదీ. తెలంగాణలో బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. డిసెంబర్ 3 తరువాత లిక్కర్ స్కాంపై విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీకి, బీజేపీకి పవన్ కళ్యాణ్ రెండవ పెళ్ళాం లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ కు ఏం పని అని ప్రశ్నించారు.
ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ రద్దుని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. మోదీ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవని అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. రూ.752కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణలో 70పైన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.