Sanjay Raut: హమాస్ ఉగ్ర సంస్థతో బీజేపీని పోల్చిన శివసేన యూబీటీ నేత..
శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భారతీయ జనతా పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీని ఆయన ఉగ్రసంస్థ హమాస్‌తో పోల్చడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇజ్రాయెల్-హమాస్ వివాదం గురించి చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందనకు కౌంటర్ ఇస్తూ సంజయ్ రౌత్ చేసిన విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.