బాసర IIIT వద్ద ఉద్రిక్త | High Tension At Basara Saraswati Temple | Basara IIIT Student Swathi | RTV
నా బిడ్డను చంపేశారు| Basara | RTV | IIIT student suicide in Telangana becomes sensational and goes to touch different edges of allegations | RTV
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సలర్‌ను తొలగించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వసతుల కల్పన, రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళనకు దిగారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన చేపట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాసర ఆర్జీయూకేటీ యూజీసీ ప్రవేశాలకు నోటిఫికెషన్ విడుదల అయింది. జూన్ 1 నుండి 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 సీట్లను భర్తీ చేయనుంది. జూలై 3 న సీట్ల కేటాయింపు, జూలై 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది.
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (IIIT) ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 22 లాస్ట్ డేట్ అని పేర్కొన్నారు.