Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజానామా!

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్‌కు పంపించారు. అంతర్గత విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం.

New Update
balineni sr

AP NEWS: ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్‌కు పంపించారు. అంతర్గత విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం.

బాలినేని వ్యతిరేకిస్తున్న వ్యక్తికే జగన్ టికెట్..

ఈ మేరకు కొంతకాలంగా పార్టీ తీరుపై బాలినేని తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్‌ను కలిసి మరోసారి తన అసంతృప్తి వ్యక్తం చేసినా పెద్దగా పట్టించుకోలేదుని, దీంతో మనస్థాపం చెందిన బాలినేని పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు చర్చ నడుస్తోంది. అంతేకాదు మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి బాలినేని సైలెంట్ కాగా.. జిల్లా రాజకీయాల్లో చెవిరెడ్డి జోక్యాన్ని బాలినేని వ్యతిరేకించడంతో రాజకీయం మరింత వేడెక్కింది. అయినప్పటికీ బాలినేని వ్యతిరేకిస్తున్నా.. జగన్ చెవిరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో బాలినేని చాలా అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి.. త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక బాలినేని జగన్ కు దగ్గర బంధువు కావడం విశేషం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు