Kerala: కేరళంగా మారునున్న కేరళ..అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు.