Bank Fraud : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ అరెస్ట్!
బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మీరు వంటలోకి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మసాలా దినుసులు వాడుతున్నారా..? అయితే ఎందుకైనా మంచిది.. ఒకటికి రెండుసార్లు అవి అసలైనవో కావో చెక్ చేసుకోండి! మేము ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామో తెలుసుకోవాలను కుంటే ఇది చదివేయండి..
కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో నిందితుడు అయిన మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణ సిట్ అధికారులకు లొంగిపోయారు. దానికి ముందు ఆయన ఇంట్లో తలుపులు వేసుకుని పూజలు నిర్వహించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు అయింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన వేసిన అత్యవసర పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్ విషయం మెయిల్ చేయాలని సీజేఐ చంద్రచూడ్ కేజ్రీవాల్ న్యాయవాదికి సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ పద్నాలుగు రోజుల రిమాండ్ మీద తీహార్ జైలుకు వెళ్ళారు.ప్రస్తుతానికి ఆయన తన పదవికి రాజీనామా చేయకపోయినా..ఇక మీదట చేయకతప్పదేమో అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీతే నెక్ట్స్ ఢిల్లీ సీఎం అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మన్నె గూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కన్నారావుతో పాటూ మరో 38 మందిపైనా పోలీసులు కేసును నమోదు చేశారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్, హేమంత్ సోరెన్ ఉన్నారు.
ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో 68 ఏళ్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సిట్టింగ్ సీఎంను ఈడీ అరెస్ట్ చేయలేదు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేయడం ఇది 16 వది.