Delhi : కేజ్రీవాల్‌కు షాక్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 15వరకు రిమాండ్‌ను ఇచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 15వరకు రిమాండ్‌ను ఇచ్చింది.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ నియంత శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన సతీమణి సునీతా అన్నారు. ఆయన కోసం 8297324624 వాట్సప్ నెంబర్‌కు మీ సందేశాలు పంపించాలని.. మీ ప్రేమ, ఆశీర్వాదలను ఆయనకు చేరవేరుస్తానని పేర్కొన్నారు.
భారత్‌లో కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియా.. అలాగే ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో కూడా ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నామని తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది రౌస్ అవెన్యూ కోర్టు. కాగా తన అరెస్ట్ అక్రమమని.. తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరగా.. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కాస్త ఊరట లభించింది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇది న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కాదని తేల్చి చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఈరోజుతో ముగుస్తోంది. ఈడీ అధికారులు ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో హాజరుపర్చనున్నారు. దీనిపై అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్కడ నుంచే తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు మళ్ళీ పరిపాలనకు సంబంధించి రెండోసారి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు ఉత్తర్వులనిచ్చారు.
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పరిపాలన చేస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. జైల్లో ఆయన కోసం కార్యాలయం ఏర్పాటుకు కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకుంటామని తెలిపారు.