CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది రౌస్ అవెన్యూ కోర్టు. కాగా తన అరెస్ట్ అక్రమమని.. తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరగా.. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.
Court reserves order on ED's plea to extend #ArvindKejriwal's remand in #LiquorPolicyScam
ED has sought further 7 days custody; Kejriwal said he is not opposing remand pic.twitter.com/8GnWW367KK
— Live Law (@LiveLawIndia) March 28, 2024
కోర్టులో వాదనలు ఇలా..
* కేజ్రీవాల్: రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. అప్పుడు ECIR ఫైల్ సృష్టించబడింది. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కోర్టు నన్ను దోషిగా గుర్తించలేదు లేదా నాపై ఆరోపణలు చేయలేదు. ED దాదాపు 25,000 పేజీలను దాఖలు చేసింది. చాలా మంది సాక్షులను విచారించింది.
* జడ్జి: ఇవన్నీ రాతపూర్వకంగా ఇవ్వగలరా? రికార్డు తీసుకుందాం.
* కేజ్రీవాల్: నన్ను మాట్లాడనివ్వండి.
* కేజ్రీవాల్: నా ఇంటికి చాలా మంది మంత్రులు వస్తుంటారు.. ఎదో పని పై ఏవో డాక్యుమెంట్స్ గుసగుసలు పెట్టి ఇస్తుంటారు.. ఇలాంటి అధరాలు సరిపోయా ఒక సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి? అని కోర్టు ప్రశ్నించారు.
* కేజ్రీవాల్: ఈడీ అధికారులు నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌లు ఇచ్చే వరకు స్టేట్‌మెంట్‌ల మీద స్టేట్‌మెంట్‌లు తీసుకుంటారు. దీని అర్థం నన్ను ట్రాప్ చేయడమే వారి ఉద్దేశం.
* కేజ్రీవాల్: రాఘవ్ మాగుంట ఇచ్చిన 7 స్టేట్మెంట్స్, అతని తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ లో నా పేరు లేదు.
* కేజ్రీవాల్: నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడానికి ఈ 4 స్టేట్మెంట్స్ సరిపోతాయా?. ఈడీ ఫైల్‌లో ఉన్న లక్ష పేజీలు మాకు అనుకూలంగా రికార్డుల్లోకి తీసుకురాలేదు.
* కేజ్రీవాల్: మద్యం కుంభకోణం నుండి వచ్చిన డబ్బు ఎక్కడికి పోయాయి?
* కేజ్రీవాల్: సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, " ఈ స్కాం లో రూ. 100 కోట్లు ఈడీ అధికారులు కోట్ చేస్తున్నారు.. మరి ఆ 100 కోట్లు ఏమైయ్యాయి. ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది."
* కేజ్రీవాల్: ఇది కేవలం దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ED ఉద్దేశం
* ఈడీ: కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని ED తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
* కేజ్రీవాల్: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యాక శరత్ రెడ్డి బీజేపీకి 50 కోట్లు డొనేట్ చేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
* కేజ్రీవాల్: నేను రిమాండ్ విచారణను వద్దు అనడం లేదు.. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ కేసులో నన్ను విచారించడండి.
* ఈడీ: లిక్కర్ స్కాం కేసులో మరింత పురోగతి కావాలంటే కేజ్రీవాల్ మరో 7 రోజుల కస్టడీ కావాలి.. గోవాకు చెందిన ఆప్ నేతలతో కలిపి విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కేజ్రీవాల్ ను ఏడు రోజల కస్టడీ ఇవ్వాలని కోర్టు కోరుతున్నాం.
* జడ్జి: ఇద్దరి న్యాయవాదుల తరఫున వాదనలు విన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది.