సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల స్వీకరణ.. పోలింగ్..ఫలితాలు అదేరోజు
ఏపీలో పంచాయతీలకు సర్పంచ్లు, వార్డుసభ్యుల ఎన్నిక జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ను విదుదల చేసింది జారీ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధనల ప్రకారం నేడు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదేరోజు ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు.నేటి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లపై అభ్యంతరాలను 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయవచ్చు.