మాగ్రామం మాకే కావాలి
పూర్తిగా చదవండి..కడప జిల్లాలో ఉప ఎన్నికల హాట్ హాట్ గా సాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించంతో హీట్ మరింత పెరుగిరింది. అధికారులు వెళ్లినా లెక్కచేయటం లేదు సుగమంచిపల్లె వాసులు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం కె సుగుమంచిపల్లెలో మరోమారు ఎన్నికల బహిష్కరించారు. ఇప్పటికీ రెండుసార్లు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు సుగుమంచిపల్లె గ్రామస్తులు. గండికోట ముంపు గ్రామాలైన బుక్కపట్నం, దత్తాపురం, కే.సుగుమంచిపల్లి, బుక్కపట్నం, దత్తాపురం గ్రామాలను కే.సుగుమంచిపల్లెలో వెళ్లి మరి గ్రామ ప్రజలను అధికారులు కలిశారు. మా గ్రామాలు మాకే ఉండాలంటూ ఎన్నికలను కే.సుగుమంచిపల్లె వాసులు డిమాండ్ చేస్తున్నారు. మూడు గ్రామాలలో కలిపి 4,700 మంది ఓటర్లు ఉన్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
ఇక ఏలూరు జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 33 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కొనసాగింది. మూడు పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 21 వార్డు స్దానాలకు ఎన్నిక జరుగుతున్నాయి. మొత్తం ఓటు హక్కును 11 వేల 114 మంది ఓటర్లు వినియోగించుకోనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు 26.708 శాతం పోలింగ్ నమోదు అయింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించారు. వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగిన్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నంది. ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు 65 శాతం పోలింగ్ నమోదు అయింది. మ.2 గంటల వరకు పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
దాడులు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు
కాకినాడ జిల్లాలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలోకి గాయపడిన కార్యకర్తను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. నాలుగో డివిజన్లో జరుగుతున్న ఒటర్ వెరిఫికేషన్ సందర్భంగా జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానంగా మారింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేస్తున్నారన్న టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన టూ టౌన్ సీఐ నాయక్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉండగానే వైసీపీకి చెందిన కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వానపల్లి పోలీస్ (35)పై విచక్షణ రహితంగా గాయపరిచారని బాధితుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఓమ్ని బాలాజీ, శ్రీకోటి అప్పలకొండ, టీడీపీ నాయకుడు తుమ్మల రమేష్, మహిళా అధ్యక్షరాలు చిక్కాల సత్యవతి ఆస్పత్రికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతోటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని భార్య ఆరోపణలు చేసింది.
హోరాహోరీగా పోటీ
శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ సర్పంచ్ పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉపేంద్రరెడ్డి, రవీంద్రారెడ్డి మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. చలివెందుల పంచాయతీ పరిధిలో రాచపల్లి, మీనకుంటపల్లి గ్రామాలు వుండగా మొత్తం 2514 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీకి మద్దతుదారుడుకి ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలో దిగి అన్ని రకాల సహకారం ఇచ్చారు. వైసీపీ మద్దతుదారుడు గెలుపు కోసం నియోజకవర్గం ఇన్చార్జ్ దీపికవేణు కూడా సవాల్‌గా తీసుకుని ప్రచారం చేశారు. సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది.
[vuukle]