Vasantha Krishna Prasad: నా వెనుక గోతులు తవ్వి..నా ప్రత్యర్థులతో చేతులు కలిపారు!
నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.