AP Weather Updates: పండుగ పూట ఏపీకి షాకింగ్ న్యూస్.. భారీ వర్షాలు!
నేడు, రేపు ఏపీలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.