AP Politics: హమాస్ ఉగ్రవాదుల్లా చేస్తున్నారు.. నారాయణస్వామి ఫైర్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు టీమ్ హమాస్ ఉగ్రవాదులు లాగా ప్రవర్తిస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.
బలమైన పార్టీగా ఉన్న కమ్యునిస్టు పార్టీలు బలహీనపడ్డాయన్నారు రఘువీరారెడ్డి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితికి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరూ ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని రఘువీరారెడ్డి సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దూకుడు పెంచుతున్నారు. ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి తనదైన శైలిలో వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె టీడీపీ మైలేజ్ పెంచడం కోసమే ఇలా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి పురందేశ్వరి చూపిస్తున్న దూకుడు.. సొంత పార్టీ కోసమా లేక టీడీపీ కోసమా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయిడు మన జాతి సంపద అని నన్నపనేని రాజకుమారి అన్నారు. ఆయనను జైలులో నిర్భందించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలు నరకం చూస్తున్నారన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర14వ రోజు బల్లికూరవ మండలంలో సాగింది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలంలోని గొర్రెపాడు గ్రామం నుంచి మండలంలోని సురేపల్లి గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగింది.
రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై, ఉమ్మడి ప్రణాళికపై లోతుగా చర్చించామని.. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా దాదాపు 3గంటలసేపు చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం కూడా మాతో కలిసి రావడానికి సానుకూలంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనీవ్వమని స్పష్టం చేశారు.
టీడీపీ రాష్ట్ర నాయకులు నారా లోకేశ్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ' కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు.
2024లో వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు నారా లోకేశ్. రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జేఏసీ సమావేశం జరిగిందన్నారు. ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో పవన్‌తో కలిసి చర్చించామన్నారు. నవంబర్ 1 నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం అన్నారు లోకేశ్.
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వైసీపీ సర్కార్ పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి దసరా అంటూ ధ్వజమెత్తారు. తిరుమల ఈవో జగన్ ఏజెంట్ గా మారాడని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ విశాఖకు మారడం.. దోచుకోవడానికేనంటూ ధ్వజమెత్తారు.