AP Politics: పవన్ కల్యాణ్ కు ట్యూషన్ చెబుతా.. మంత్రి బొత్స సంచలన వాఖ్యలు
పవన్ కల్యాణ్ ఏదైనా అంశంపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కావాలంటే ఆయనకు ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధం అన్నారు.
పవన్ కల్యాణ్ ఏదైనా అంశంపై మాట్లాడే ముందు అవగాహన పెంచుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కావాలంటే ఆయనకు ట్యూషన్ చెప్పడానికి తాను సిద్ధం అన్నారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట అయిన నర్సీపట్నంలో గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం నిజంగా పెను సంచలనం. అయితే గెలిచిన తర్వాత ఉమా శంకర్ గణేశ్ క్యాడర్ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, టీడీపీ నేతల ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. రిమాండ్ లో ఉన్న ఖైదీ హెల్త్ రిపోర్ట్స్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సంపాదన కోసమే చంద్రబాబు సీఎం అయ్యారంటూ తీవ్ర వాఖ్యలు చేశారు సజ్జల.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాదులు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదన్నారు. బాబు హెల్త్ పై నిత్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి వస్తుందన్నారు.
మంత్రి రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రోజాకు నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
ఎన్డీయేకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కటీఫ్ చెప్పేశారు. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) నుంచి బయటకు వచ్చినట్టు జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టీడీపీ లాంటి బలీయమైన శక్తి అవసరమని పవన్ పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి జగన్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వైసిపీలో నాకు అన్యాయం జరిగింది, అక్కడి వారే నన్ను రోడ్డున పెట్టారు అని సంచలన కామెంట్స్ చేశారు నటుడు పృథ్వీరాజ్. జగన్ అసలు నాయకత్వం లేని నాయకుడని తిట్టిపోశారు. జగన్ ను నమ్ముకున్న వారు ఎప్పటికైనా రోడ్డున పడాల్సిందే అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.