Mahanandhi: మహానందిలో మరోసారి చిరుత కలకలం!
నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు.
నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానం వెనుక గోశాల వద్ద శుక్రవారం రాత్రి 8:50 గంటల సమయంలో చిరుత పులి సంచరించినట్లు దేవస్థానం అధికారులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ గన్మెన్లను నోటీసు ఇవ్వకుండా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మధ్యాహ్నం పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 57,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఇవాళ లేదంటే రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
AP: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం వచ్చే ఏడాదికైనా తమకు పునరావాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
11వ బడ్జెట్ లోనూ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా.. లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా అన్నది క్లారిటీ లేదన్నారు.