Murder: ప్రేమించి పెళ్లాడిన భార్యను కిరాతకంగా చంపిన భర్త! ఏపీలోని అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లాడిన భార్య దేవిని ఆవేశంలో తలపై కొట్టి చంపేశాడు. కుంటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్దారించారు. పరారిలో ఉన్న నిందితుడిని పట్టుకుని రిమాండ్ కు తరలించారు. By srinivas 03 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి AP News: ఏపీలోని అల్లూరి జిల్లా అరకులోయలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. మొదటి భార్య, పిల్లలు ఉండగానే ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న రెండవ భార్యను తలపై మోది దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-03-at-7.00.08-PM.mp4"> ఈ మేరకు డుంబ్రిగూడ మండలం కించుమండ గ్రామానికి చెందిన నిందితుడు రాజ్ కుమార్ మండలంలోని పోతంగి పంచాయతీ బల్లుగుడ గ్రామానికి చెందిన బంగారు దేవిని ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అకారణంగా కుటుంబంలోని చిన్న చిన్న తగాదాలకు కోపోద్రిక్తుడైన రాజకుమార్ మూడు రోజుల క్రితం తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ మేరకు భార్య తరఫున నమోదైన కేసును ఆధారంగా సిఐ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో డుంబ్రిగూడ ఎస్సై, ఇతర పోలీసులు, నిందితుడు ఈ ఉదయం స్థానిక జైపూర్ జంక్షన్ వద్ద ఉన్నాడని తెలిసి వలవేసి పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితునిపై అత్యా నేరం నమోదు చేసి రిమైండర్ కు పంపుతున్నట్లు సీఐ రుద్ర శేఖర్ తెలియజేశారు. #rajkumar #killed-wife #ap-news #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి