మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం ధరలు తగ్గింపు!
AP: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.
🛑LIVE NEWS: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన!
AP: కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే!
ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాాలని నిర్ణయించింది.
నాకు రాజ్యసభ సీటు వద్దు.. నాగబాబు సంచలన ట్వీట్!
AP: తనను రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది సొంత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
🛑LIVE NEWS: కొండా సురేఖకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సమన్లు జారీ!
BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!
AP: వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పీఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు.
BIG BREAKING: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. ఒకరు మృతి.. అనేక మందికి..
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీక్ కావడంతో ఒకరు మృతి చెందగా చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.