AP High Court: రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలి: హైకోర్టు
గుంటూరు జిల్లా వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది.