Chandrababu: అప్పటి వరకు నో అరెస్ట్.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట!
ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక పాలసీ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసులను ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.