టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | CM Chandrababu Naidu | RTV
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Naidu Conducts Meeting with Cabinet and Party Leaders to discuss mainly on 8 points like Panchayats, Party Membership etc | RTV
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Naidu Conducts Meeting with Cabinet and Party Leaders to discuss mainly on 8 points like Panchayats, Party Membership etc | RTV
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఈ నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకూ తెరిచి ఉండనున్నాయి.
సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. 58 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చింది. ఇది గర్వించదగ్గ విషయమని బన్నీపై ప్రశంసలు కురిపించారు.
వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 9వరకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించనుంది.
విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
వరద బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి CMR సంస్థ భారీ విరాళం అందించింది. శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 50 లక్షల చెక్కును సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అందించారు. విరాళం ఇచ్చిన CMRకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
జగన్‌ను మర్డర్ చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అయిన బాబు కుట్రతోనే జగన్‌పై లడ్డూ బురద జల్లుతున్నారన్నారు. మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా బాబు మోసం చేసేవాడని మండిపడ్డారు.