అన్‌స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు.. వీటిపైనే మాట్లాడేది!

అన్‌స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్‌‌లో రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రజలకు చేయవలసిన మంచి పనులు సహా మరిన్ని విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
Unstoppable 4

నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. అందులో ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ ఒకటి. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్లకు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య బాబు తన శైలిలో ఈ టాక్ షోను పైకి లేపారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలతో ఈ టాక్‌ షోకు కొత్త ఉత్సాహం వచ్చింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

వారి సీక్రెట్స్‌ను చెప్పమని బాలయ్య బాబు నవ్వించే తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇలా వరుసగా మూడు సీజన్లను తన బుజాలపై వేసుకుని విపరీతమైన క్రేజ్ తెచ్చాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, గోపీచంద్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్ సహా మరెంతో మంది నటులతో సరదా సరదాగా ముచ్చటించారు. అలాగే అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ఇంతకు ముందు సీజన్‌లో తీసుకొచ్చాడు. ఆ ఎపిసోడ్‌కి బాగా రెస్పాన్స్ వచ్చింది. 

chandrababu,

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

అయితే అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఈ షో సరికొత్త సీజన్‌ అక్టోబర్‌ 25 నుంచి ప్రసారం కానుంది. ఈ నాలుగో సీజన్‌కు కూడా బాలయ్య బాబే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

chandrababu,,

అయితే ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఆహా సెట్‌లో దర్శనమిచ్చారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి అన్‌స్టాపబుల్ సెట్‌లోకి బాలయ్య ఆహ్వానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

ఏ ఏ విషయాలపై మాట్లాడుతారు

కాగా ఈ తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు ఏ ఏ విషయాలపై మాట్లాడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రజలకు చేయవలసిన మంచి పనులు సహా తన వ్యక్తిగత విషయాలు గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు ఏ విషయాలపై మాట్లాడతారో. 

Advertisment
Advertisment
తాజా కథనాలు