ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి కానుక..! ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశక్తి పథకాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నారు. By Seetha Ram 20 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ రూ.3,640 కోట్లకు పైగా ఖర్చు కాగా ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో 1.47 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తే దాదాపు రూ.3,640 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్! సిలిండర్ ధర రూ.837 కాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కసరత్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో అని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.837గా ఉంటుందని.. అలా ఏడాదికి రూ.2,511 ఆదా అవుతుందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు! ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు అందించాయి. ఉజ్వల పథకం, దీపం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు ఉన్న 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే రూ.1,763 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కకడుతున్నారు. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయ్యి.. సీఎంకు పలు సిఫార్సులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో ఏపీ ప్రజలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు #andhra-pradesh #ap-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి