AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం
పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు బిల్లు, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.