AP Speaker Ayyannapathrudu: ఏపీ స్పీకర్ అయ్యన్న సంచలన రికార్డు.. అభినందనల వెల్లువ! అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించి ఔరా అనిపించారు ఏపీ స్పికర్ అయ్యన్న పాత్రుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ayyannapathrudu: ఏపీ స్పికర్ అయ్యన్న పాత్రుడు సంచలన రికార్డ్ సృష్టించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించి ఔరా అనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగు భాషా పట్ల స్పీకర్ గారి తీసుకున్న ఈ నిర్ణయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేశారు. తమ మాతృభాషకు గౌరవం ఇచ్చే ఈ ప్రయత్నం అనేకమందికి స్ఫూర్తిదాయకమైందని కొనియాడుతున్నారు. Your browser does not support the video tag. అలాగే ప్రభుత్వ పనుల్లో తెలుగు భాషా వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలకమైన అడుగుగా భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాత ఇతర నాయకులు, సభ్యులు కూడా తమ ప్రసంగాల్లో తెలుగు వాడాలనే సంకల్పాన్ని ప్రదర్శించారు. ఈ ఒరవడి వల్ల భవిష్యత్తులో తెలుగుకు మరింత ప్రాధాన్యం కలిగే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. #ap-speaker-ayyannapathrudu #ap-assembly మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి