Janasena : జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు.
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు.
వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నాలుగో విడత ఆర్థిక సాయాన్ని ఇవాళ జగన్ సర్కార్ అందించనుంది. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుంది.
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు ఏడీసీసీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో మహిళలను మాట్లాడనివ్వకపోవడంపై వాగ్వాదానికి దిగారు.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించనుంది జగన్ సర్కార్. విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించనున్నారు. ఇవాళ రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పార్టీల మార్పుల శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. త్వరలోనే తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈరోజు బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు జయరాం.
ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి కొడాలి నాని. పీకే ఒక చిల్లర మనిషి అని కామెంట్స్ చేశారు. ఐప్యాక్ నుండి అతన్ని తన్ని తరిమేశారన్నారు. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైందని ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని అందుకే కక్షసాధిస్తున్నాడని ఫైర్ అయ్యారు.
అన్నమయ్య జిల్లా నీరుగుట్టివారిపల్లెలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో ఓ కసాయి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల మృగంలా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెట్టినా కనికరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.