Vizag Metro: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్..!
విశాఖ వాసులకు శుభవార్త. మెట్రో నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన మెట్రో రైల్ నిర్మాణ పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మెట్రో కార్పొరేషన్తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. కీలక చర్చలు జరిపారు.