అనంత రైతులకు పంట నష్టం..| Farmers Incur Losses on Grape Crops| RTV
అనంత రైతులకు పంట నష్టం..| Farmers Incur Losses on Grape Crops| in Andhra pradesh and anticipate the Support of Government to recoup losses RTV
అనంత రైతులకు పంట నష్టం..| Farmers Incur Losses on Grape Crops| in Andhra pradesh and anticipate the Support of Government to recoup losses RTV
అనంతపురం జిల్లా శింగనమలలో వితంతువును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు గురిచేశాడు. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్స్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ అతడు మాట్లాడిన ఆడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించింది.
అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. రూ. 53 లక్షల విలువ చేసే 266 సెల్ ఫోన్లను తాజాగా రికవరీ చేశారు. ఇప్పటివరకు చాట్ బాట్ సేవల ద్వారా 15. 04 కోట్లు విలువచేసే 8886 ఫోన్లను రికవరీ చేసినట్టు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు.
మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి.. కృష్ణా జలాలు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. మాజీ సీఎం జగన్కు రూ. 1000 పెంచడానికి ఐదేళ్లు సమయం పట్టిందని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలచిపోతుందన్నారు.
అనంతపురం జిల్లా మడకశిరలో సంతలో సుంకం వసూలు చేసే వారిపై ఎమ్మెల్యే M.S రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సుంకం వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం జగన్పై విమర్శలు చేయడం కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు అనంతపురం ZP చైర్మన్ బోయ గిరిజమ్మ. ఏపీలో జరుగుతున్న దాడులను, హింసను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నారు.
అనంతపురం జిల్లా నేమకల్లులో పరిశ్రమల యాజమాన్యం, రైతన్నలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిశ్రమల నుండి వస్తున్న డస్ట్ వల్ల నష్టపోతున్నామని రైతులు పొల్యూషన్ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంతపురం జిల్లా కదిరిలో మద్యం మత్తులో ఓ యువకుడు నాగుపాముతో చలగాటం ఆడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. స్థానికులు అతడిని ఎంతగా వారిస్తున్నా పట్టించుకోకుండా పాముతో ఆటలాడుతుండగా పాము కాటు వేసింది. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.