AP: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!

అనంతపురం జిల్లా శింగనమలలో వితంతువును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు గురిచేశాడు. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్స్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ అతడు మాట్లాడిన ఆడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించింది.

New Update
AP: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!

Ananthapur: అక్కా అంటూనే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తనను వేధింపులకు గురిచేశాడని ఓ వితంతువు ఆవేదన వ్యక్తం చేస్తోంది.  అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి రాత్రీ ఫోన్ చేసి.. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు కాల్ రికార్డింగ్ చేసి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసులు నాయుడుపై శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: పెళ్లయిన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. అందుకే చనిపోతున్నా అంటూ..

బాధితురాలి భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ ఆమె కుమారులను పోషిస్తోంది. ఆదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. 'నువ్వు పనులకు రాకపోయినా పరవాలేదు.. నా వద్దకు రా.. డబ్బు సంపాదించుకో. నువ్వు బాగుండు.. నేనూ బాగుంటా.. నీకు బయటకు వచ్చేందుకు వీలవుతుందా..? ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. రూ.3 లక్షలు లోన్ ఇప్పిస్తా..' అని ఓ వితంతువు పట్ల అను చితంగా ప్రవర్తించాడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్.

ఆమెకు పదే పదే ఫోన్స్ చేసి వేధింపులకు గురిచేసేవాడు. 'నీకూ పెళ్లాం పిల్లలు ఉంటారు కదా శీనూ.? వాళ్లను ఎవరైనా ఇట్ల అడిగితే ఊరికే ఉంటావా..?' అని బాధిత మహిళ ప్రశ్నించినా.. తన తీరు మారలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ప్రస్తుతం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు