Ambati Rambabu: మంత్రి రజినీ ఆఫీసు పై దాడి దుర్మార్గం: అంబటి రాంబాబు!
ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు
ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు
పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఇతర నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈ సమస్యను హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రశాంత్ కిశోర్ ఈ రోజు చంద్రబాబుతో కలవడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా.. పార్టీకి దమ్ము లేనప్పుడు ఉపయోగం ఉండదన్నారు. చంద్రబాబు నైతికంగా ఎంత నీచమైన పరిస్థితికి దిగజారాడో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. ప్రతీ సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అలసత్వం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం కలిగింది అని ఫైర్ అయ్యారు.
లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి టీడీపీకి కోవర్టు లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
టిడిపి నాయకులపై ఫైర్ అయ్యారు మంత్రి అంబటి. ‘‘వచ్చింది బెయిలే.. నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు !’’ అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు.
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని సెటైర్లు వేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి.