Ambati Rambabu: మంత్రి రజినీ ఆఫీసు పై దాడి దుర్మార్గం: అంబటి రాంబాబు! ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు By Bhavana 01 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి సోమవారం గుంటూరులో మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) ఆఫీసు మీద కొందరు దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనిని కావాలనే టీడీపీ వారు చేస్తున్నారని ..రాష్ట్రంలో వారి రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. అది టీడీపీ ముందుగా అనుకున్న పథకం ప్రకారమే కొత్త సంవత్సరం అని కూడా చూడకుండా మంత్రి కార్యాలయం మీద దాడులు చేశారని అన్నారు. మంత్రి కార్యాలయం మీద దాడి చేయడం అంటే హింసను ముందుకు నడిపించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడింది ఎవరైనా సరే వారిని వదిలేది లేదని అంబటి అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. దమ్ముంటే ప్రజాస్వామ్య బద్దంగా ఆమె మీద పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు. బీసీ మహిళ పోటీ చేస్తుంటే భయపడి చస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే రాష్ట్రంలో ఎలాంటి ఆరాచక శక్తులు ఏర్పడతాయో ఇప్పటికైనా ప్రజలు గమనించాలన్నారు. జనసేన అధినేత అయితే బహిరంగంగానే బూతులు తిడుతూ చెప్పులు చూపిస్తూ అభిమానులను , కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. నారా లోకేష్ రాసుకుంటుంది ఎర్ర బుక్కో, ఎర్రి బుక్కో ముందు ముందు తెలుస్తుందని వివరించారు. ఆ ఎర్ర బుక్కు పేరు చెప్పుకొని రాష్ట్రంలో మంత్రులను, ఎమ్మెల్యేలను బెదిరించడం టీడీపీ వారికి పరిపాటిగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం జరగదు. కుప్పంలో చంద్రబాబు ఘోర పరాజయాన్ని పొందుతారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అసలు కుప్పంలో గెలిచిన తరువాత ఒక్కనాడు అయినా నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆయన పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. కనీసం రాష్ట్రంలో ఓ సొంత ఇల్లు కూడా లేదు కానీ రాష్ట్రానికి మాత్రం ఏదో చేస్తారంటా అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రపంచ మేధావులు, చంద్రబాబు, పవన్ చేస్తున్నా ఆరాచకాలను గమనించాలన్నారు. Also read: మాదాపూర్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం! #ambati-rambabu #vidadhala-rajini #attack #minister #office మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి