Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం!
మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు
మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు
సాయంత్రం బయటకు వెళుతున్నారా...పనులు చేసుకుందామనుకుంటున్నారా...అయితే అవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో భారీ వష్ం పడనుంది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరించారు.
జార్ఖండ్ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్ లలో బర్డ్ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్ లో ఏవియన్ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.
జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది.
ఏపీలో సోమవారం భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి సౌత్ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
గతేడాది మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.