CINEMA: అలియా వర్సెస్ దీపికా పదుకొణె.. నెట్టింట రచ్చ లేపుతున్న ఫ్యాన్ వార్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, అలియా భట్ పేర్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఆన్లైన్ యుద్ధం మొదలైంది.

New Update
alia- deepika

alia- deepika

DEEPIKA VS ALIA: బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, అలియా భట్ పేర్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఆన్లైన్ యుద్ధం మొదలైంది. వ్యక్తిగతంగా అలియా- దీపికా మంచి స్నేహితులు అయినప్పటికీ.. వీరి అభిమానులు మాత్రం తరచు వీరిని పోలుస్తూ వివాదాలకు కారణమవుతున్నారు. తాజాగా అమెరికన్ క్లాతింగ్ బ్రాండ్  'లెవిస్' బ్రాండింగ్ విషయంలో వీరి ఫ్యాన్స్ మధ్య వివాదం మొదలైంది. గతంలో 'లెవిస్' గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. కాగా, ఇప్పుడు లెవిస్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ ని ప్రకటించడంతో  నెట్టింట ఫ్యాన్స్ రచ్చ  మొదలైంది.

దీపిక- అలియా ఫ్యాన్ వార్.. 

శుక్రవారం నాడు ఈ ప్రకటన రాగానే దీపికా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. "ఆలియా చాలా అసూయగా ఉంది. ఎందుకంతగా దీపికను ఫాలో అవుతుంది? ఆమె మొహాన్ని చూసి మాకు విసుగు వచ్చింది" అంటూ  కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ''అలియా దీపిక నుంచి అన్నీ లాగేసుకుంటున్నావు" అని ఆరోపించారు. మరో నెటిజన్ అలియాను ఎందుకు ఎంచుకున్నారు? మాకు దీపికానే కావాలి అని రాశాడు! ఇంకో అభిమాని "ఈ మార్పు అస్సలు బాలేదు" అని స్పష్టంగా చెప్పేశారు. ఈ ఫ్యాన్ వార్ పై దీపిక లేదా ఆలియా స్పందించలేదు. కానీ, ఈ వివాదంతో దీపిక వర్సెస్ అలియా అనే చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. 

Also Read: BIGG BOSS 9 TELUGU: బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆర్మీ మ్యాన్ .. ఫస్ట్ కామనర్ గా బిగ్ బాస్ లోకి!

Advertisment
తాజా కథనాలు