Crime News: ఏసీబీ వలలో అవినీతి SI.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యాడు.!
ప్రకాశం జిల్లా టంగుటూరులో SI నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. సివిల్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేయగా బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ. 70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా SI దొరికిపోయాడు. రైడ్ లో భాగంగా పోలీస్ స్టేషన్ మొత్తం తనిఖీలు చేశారు అధికారులు.