/rtv/media/media_files/2025/02/10/jlj14j45uMe4xXCNF5qM.jpg)
chilakaluripeta
ACB raids : పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండల ఎంఈవో లక్ష్మి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాసరావు పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఎంఈవోను సంప్రదించాడు. తన పీఎఫ్ ఫైల్‌ను ట్రెజరీకి పంపించాలని కోరాడు.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే
అయితే పీఎఫ్ డబ్బుల ఫైల్ ట్రెజరీకి పంపాలంటే రూ.30 వేలు ఇవ్వాలని ఎంఈవో లక్ష్మి డిమాండ్ చేశారు. దానికోసం మధ్యవర్తి మాజేటి శ్రీనివాసరావు చేత ఉపాధ్యాయుడికి చెప్పించారు. దీంతో ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఎంఈవో లక్ష్మి తన ఇంటివద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మితో పాటు ఆమెకు సహకరించిన మధ్యవర్తి మాజేటి వెంకట శ్రీనివాస రావును కూడా అరెస్ట్ చేసినట్లు గుంటూరు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Also Read : ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
https://rtvlive.com/videos/film/janasena-megastar-chiranjeev-laila-pre-release-event-rtv-8708089