మెగాస్టార్‌కు అభినందనల వెల్లువ.. ఇది కదా బాస్‌ రేంజ్‌ అంటే..!

మెగాస్టార్‌ చిరంజీవిను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. చిరుకు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని చెప్పారు.

New Update
Minister Komati Reddy Venkat Reddy

Cinema News: గిన్నిస్ రికార్డ్ సాధించిన చిరంజీవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాక.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి అని కోమటిరెడ్డి కీర్తించారు. చిరు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిందన్నారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. 

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాజాగా చిరు ఖాతాలో మరో అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్‌ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్‌గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు.ఈ మేరకు  బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌  గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు అవార్డును ప్రదానం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు