INDvsENG 2nd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు క్రికెట్ రూల్స్ గురించి అవగాహన చాలా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. క్రికెట్ రూల్స్ గురించి అంపైర్లకే వివరించేత నాలేడ్జ్ ఉన్న ఈ తమిళ తంబీ తన యూట్యూబ్ ఛానెల్లోనూ దీని గురించి చర్చిస్తుంటాడు. ఇక ఫీల్డులో రూల్స్ ను చాలా పర్ఫెక్టుగా వాడుతుంటాడు. తాజాగా విశాఖపట్నం వేదికగా ఇంగ్లండుతో జరుగుతున్న రెండో టెస్టులో ప్రముఖ అంపైర్ మారియస్ ఎరాస్మస్ తో వాగ్వాదానికి దిగాడు అశ్విన్. మైదానంలో ఎంతో కూల్ గా కనిపించే అశ్విన్..అంపైర్ తో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఏమోచ్చిందని అందరి డౌట్.
ఇది కూడా చదవండి: వైసీపీ ఆరో జాబితా రిలీజ్..గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి..!!
&
Ravichandran Ashwin got angry during the conversation with the Umpire Marais Erasmus in India vs England 2nd Test at Vizag. pic.twitter.com/O5K3poT685
— Crickaith (@Crickaith) February 2, 2024
;
తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ కు భారీ స్కోరు అందించాడు యశస్వీ జైస్వాల్. కానీ మరో ఎండ్ లో అశ్విన్ ఎరాస్మస్ తో ఏదో సీరియస్ గా చర్చించాడు. దీంతో జైస్వాల్ తోపాటు ఇంగ్లండ్ ఆటగాళ్ల కళ్లు కూడా అశ్విన్ వైపు మళ్లాయి. ఎరాస్మస్ తో సీరియస్ గానే చర్చించాడు. తర్వాత అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే అశ్విన్ ఎరాస్మస్ తో ఏం చర్చించాడనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.