INDvsENG 2nd Test: అశ్విన్ తోనే ఆటలా...అంపైర్ కే రూల్స్ చెప్పాడుగా..!! విశాఖ టెస్టులో తొలిరోజు ఆటముగిసే సమయానికి కెమెరాలతోపాటు క్రికెట్ అభిమానుల ఫోకస్ అంతా యశస్వీ జైస్వాల్ వైపే ఉంది. యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ మరో ఎండ్ లో అశ్విన్..అంపైర్ తో ఏదో సీరియస్ చర్చించడం వైరల్ గా మారింది. By Bhoomi 02 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి INDvsENG 2nd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు క్రికెట్ రూల్స్ గురించి అవగాహన చాలా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. క్రికెట్ రూల్స్ గురించి అంపైర్లకే వివరించేత నాలేడ్జ్ ఉన్న ఈ తమిళ తంబీ తన యూట్యూబ్ ఛానెల్లోనూ దీని గురించి చర్చిస్తుంటాడు. ఇక ఫీల్డులో రూల్స్ ను చాలా పర్ఫెక్టుగా వాడుతుంటాడు. తాజాగా విశాఖపట్నం వేదికగా ఇంగ్లండుతో జరుగుతున్న రెండో టెస్టులో ప్రముఖ అంపైర్ మారియస్ ఎరాస్మస్ తో వాగ్వాదానికి దిగాడు అశ్విన్. మైదానంలో ఎంతో కూల్ గా కనిపించే అశ్విన్..అంపైర్ తో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఏమోచ్చిందని అందరి డౌట్. ఇది కూడా చదవండి: వైసీపీ ఆరో జాబితా రిలీజ్..గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి..!! & Ravichandran Ashwin got angry during the conversation with the Umpire Marais Erasmus in India vs England 2nd Test at Vizag. pic.twitter.com/O5K3poT685 — Crickaith (@Crickaith) February 2, 2024 ; తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ కు భారీ స్కోరు అందించాడు యశస్వీ జైస్వాల్. కానీ మరో ఎండ్ లో అశ్విన్ ఎరాస్మస్ తో ఏదో సీరియస్ గా చర్చించాడు. దీంతో జైస్వాల్ తోపాటు ఇంగ్లండ్ ఆటగాళ్ల కళ్లు కూడా అశ్విన్ వైపు మళ్లాయి. ఎరాస్మస్ తో సీరియస్ గానే చర్చించాడు. తర్వాత అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే అశ్విన్ ఎరాస్మస్ తో ఏం చర్చించాడనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. #indian-cricket-team-bcci #yashaswi-jaiswal #india-vs-england #cricket-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి