ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో యశస్వి జైస్వాల్ (84) ఔటైన తీరుపై వివాదం చెలరేగింది. స్నికోమీటర్‌లో ఎలాంటి స్పైక్ రాకపోయినప్పటికీ థర్ట్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల టార్గెట్‌లో టీమిండర్ బ్యాటర్లు విఫలమయ్యారు. కానీ యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా అడాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (70.5 ఓవర్) లెగ్‌సైడ్ బాల్‌ను విసిరాడు. ఆ షాట్ కొట్టేందుకు యశస్వి యత్నించగా.. బాల్ మిస్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లిపోయింది.
Also Read: Rishab డార్క్ డేకి రెండేళ్లు.. యాక్సిడెంట్ తర్వాత జీవితం ఎలా మారింది?
ముందుగా దీనిపై ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో కమిన్స్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. మళ్లీ దీనిపై రివ్యూ చేయగా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. వాస్తవానికి బ్యాట్‌ను బంతి తాకిందా? లేదా ? అనే దాన్ని స్నికో మీటర్‌లో వచ్చే స్పైక్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ యశస్వి విషయంలో మత్రం స్నికోమీటర్‌లో ఎలాంటి స్పై్క్ రాలేదు. ఇలా జరగకపోయినప్పటికీ బంతి గమనం మారింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. మరోవైపు సోషల్ మీడియాలో యశస్వీ ఔట్‌కి సంబంధించి నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు ఓడిపోతామని అనుకునే మ్యాచ్‌లో చీటింగ్ చేసిన హిస్టరీ ఉందని అంటున్నారు. జైస్వాల్ ఔట్ కానప్పటికీ థర్డ్ అంపైర్ చీట్ చేసి ఔట్‌గా ప్రకటించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Australia has a history of cheating when they cannot win by playing. Yashasvi Jaiswal was clearly not out but the third umpire cheated and declared him out while Ultraedge clearly showed him not out.
— Rocky Bhai 🚨 (@Iambakshi) December 30, 2024
Bastard Cheater Kangaroo 🤬 #INDvsAUSTest #INDvsAUS #INDvAUS #AUSvINDIA pic.twitter.com/NaIOEJZVuw
స్పైక్ ఎందుకు రాలేదు ?
యశస్వి జైస్వాల్ ఔట్‌కి సంబంధించి స్నికో ఆపరేట్ చేసే బీబీసీ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిది వారెన్ బ్రెన్నన్ స్పందించారు. '' జైస్వాల్ ఆ షాట్ ఆడినప్పుడు ఎలాంటి శబ్దం రాలేదు. అందుకే స్నికోమీటర్‌లో స్పైక్ రాలేదు. దీని గురించి ఆడియో డైరెక్టర్‌తో కూడా మాట్లాడాను. అతడు ఇదే చెప్పాడని'' వారెన్ తెలిపారు. మరోవైపు సైమన్ టౌఫెల్ మాట్లాడుతూ.. ' నా ఉద్దేశం ప్రకారం జైస్వాల్ ఔట్. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే. అంపైర్‌లకు టెక్నాలజీ సాయంతో బంతి గమనాన్ని తెలుసుకునేందుకు వీలుంటుందని'' తెలిపారు. ఇదిలాఉండగా.. ఒకే ఏడాదిలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన మూడో టీమిండియా బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఈ ఏడాదిలో అతడు 1478 రన్స్ చేశాడు. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. సునీల్ గావస్కర్ 1979లో 1555 పరుగులు చేశాడు.