Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ ‘కీ’ విడుదలైంది. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిలాఉండగా.. డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’లపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 28 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. వీటిని పరిశీలించిన విద్యాశాఖ తాజాగా ఫైనల్ ‘కీ’ని విడుదల చేసింది.
ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20 నాటికి అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. దాదాపు 10 రోజులకు పైగా అభ్యంతరాల పరిశీలను చేపట్టింది. ఫైనల్ కీ విడుదల కావడంతో త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు.